ఇంద్రజ మమ్మీ ఐతే ఈజిప్ట్ లో ఉన్నవి డమ్మీలా..
on Mar 18, 2025
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షోలో బుల్లితెర మీద కొంతకాలం క్రితం వరకు ఉన్న జెస్సి మళ్ళీ ఈ ఎపిసోడ్ లో మెరిశాడు. అలాగే నూకరాజు ఉపేంద్ర గెటప్ లో వచ్చి అందరికీ గన్ చూపిస్తూ ఉపేంద్ర మార్క్ డైలాగ్స్ తో అలరించాడు. జెస్సిని స్టేజి మీదకు పిలిచాడు నూకరాజు. "నీపేరేమిటి" అనేసరికి "జెస్సి" అన్నాడు. "ఫ్యూచర్ లో నువ్వు స్టార్ అవుతావు అన్నాడు. ఔనా ఏ స్టార్ మెగా స్టారా, పవర్ స్టారా" అన్నాడు ఆవేశంగా జెస్సి. "ఆవేశం స్టార్ " అన్నాడు నూకరాజు "నువ్వు కచ్చితంగా ఆవేశం స్టార్ అవుతావు ..నమ్మవా... "అన్నాడు నమ్మను అన్నాడు జెస్సి. "చచ్చిన చేపకైనా ఆ రేట్ ఉంది నీకు ఉందా" అని కౌంటర్ ఇచ్చాడు నూకరాజు.
"అర్జెంటు గా మేనేజర్ ని పిలిపించి జెసిని బయటకు పంపించేయమనండి" అన్నాడు దాంతో ఆది "మేనేజర్ వచ్చి నిన్నే బయటకు గెంటితే" అంటూ రివర్స్ కౌంటర్ వేసాడు. ఇక ఇంద్రజాను చూసి "ఎవరీమె" అన్నాడు .. దానికి నరేష్ "మమ్మీ" అనేసరికి "ఈవిడ మమ్మీ ఐతే ఈజిప్ట్ లో ఉన్నవి డమ్మీలా" అంటూ మళ్ళీ కౌంటర్ వేసాడు. జెస్సి కొంతకాలం క్రితం వరకు ఢీ షోకి వచ్చేవాడు..మధ్యమధ్యలో స్కిట్స్ వేయడానికి. ఆ తర్వాత నుంచి ఆయన బుల్లితెర మీద ఎక్కడా కనిపించడమే మానేసాడు. సోషల్ మీడియాలో మాత్రమే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ చాలా రోజులకు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి అలరించాడు. ఐతే ఈ షోలో ఇమ్మానుయేల్ కనిపించలేదు..రెగ్యులర్ గా ప్రతీ ఆదివారం షోలో కనిపించే ఇమ్ము ఈ వారం ఆదివారం స్టార్ మా పరివారం షోలో మెరిశాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
